Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 8 వచనము 3

సంఖ్యాకాండము 13:21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

సంఖ్యాకాండము 34:8 హోరు కొండయొద్దనుండి హమాతునకు పోవుమార్గమువరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.

2సమూయేలు 8:3 సోబా రాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి

1రాజులు 11:23 మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.

1రాజులు 11:24 దావీదు సోబావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్యమునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.

1రాజులు 11:25 హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరోధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యత గలవాడై యుండెను.

1దినవృత్తాంతములు 18:3 సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

2సమూయేలు 8:5 మరియు దమస్కులోనున్న సిరియనులు సోబా రాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి

2రాజులు 14:28 యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

యిర్మియా 52:9 వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లాపట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతని తీసికొనిపోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను.