Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 8 వచనము 8

న్యాయాధిపతులు 1:21 యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

న్యాయాధిపతులు 1:22 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.

న్యాయాధిపతులు 1:23 పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా

న్యాయాధిపతులు 1:24 ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచినీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.

న్యాయాధిపతులు 1:25 అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తి వాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.

న్యాయాధిపతులు 1:26 ఆ మనుష్యుడు హిత్తీయుల దేశము నకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.

న్యాయాధిపతులు 1:27 మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొన లేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి.

న్యాయాధిపతులు 1:28 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులచేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.

న్యాయాధిపతులు 1:29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి.

న్యాయాధిపతులు 1:30 జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.

న్యాయాధిపతులు 1:31 ఆషే రీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని అఫెకువారిని రెహోబు వారిని

న్యాయాధిపతులు 1:32 ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షె మెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదు గాని

న్యాయాధిపతులు 1:33 బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.

న్యాయాధిపతులు 1:34 అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.

న్యాయాధిపతులు 1:35 అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి

న్యాయాధిపతులు 1:36 అమోరీయుల సరి హద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.

కీర్తనలు 106:34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.

2దినవృత్తాంతములు 2:17 సొలొమోను తన తండ్రియైన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతివారినందరిని, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష యెనుబదిమూడువేల ఆరువందలమందియైరి.

2దినవృత్తాంతములు 2:18 వీరిలో బరువులు మోయుటకు డెబ్బది వేల మందిని పర్వతములందు మ్రానులు కొట్టుటకు ఎనుబది వేల మందిని, జనులమీద అధిపతులుగానుండి పనిచేయించుటకు మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచెను.

యెహోషువ 16:10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.

యెహోషువ 17:13 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులచేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు.

1రాజులు 5:13 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టిపని చేయువారైరి,

1రాజులు 5:14 వీరిని అతడు వంతులచొప్పున నెలకు పదివేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.

ఆదికాండము 9:25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

1రాజులు 9:20 అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.

1దినవృత్తాంతములు 22:2 తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.