Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 13 వచనము 1

2దినవృత్తాంతములు 12:16 రెహబామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.

1రాజులు 15:1 నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదావారిని ఏలనారంభించెను.

1రాజులు 15:2 అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.

1రాజులు 15:3 అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.

1రాజులు 15:4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక

1రాజులు 15:5 దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను.

1రాజులు 15:6 రెహబాము1 బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

1రాజులు 15:7 అబీయాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను.

1రాజులు 15:8 అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 3:10 అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు