Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 13 వచనము 2

2దినవృత్తాంతములు 11:20 పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయకాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.

1రాజులు 15:2 అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.

యెహోషువ 18:28 వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.

న్యాయాధిపతులు 19:14 అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.

న్యాయాధిపతులు 19:16 ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాల మున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.

1సమూయేలు 10:26 సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంటవెళ్లిరి.

1రాజులు 15:6 రెహబాము1 బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

1రాజులు 15:7 అబీయాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను.

1రాజులు 14:19 యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

1రాజులు 15:10 అతడు నలువదియొక సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు1 మయకా, యీమె అబీషాలోము కుమార్తె.