Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 14 వచనము 15

1దినవృత్తాంతములు 4:41 పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొనియున్నారు.

సంఖ్యాకాండము 31:9 అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱమేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.

సంఖ్యాకాండము 31:30 మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 31:31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.

సంఖ్యాకాండము 31:32 ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది

సంఖ్యాకాండము 31:33 ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును,

సంఖ్యాకాండము 31:34 డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,

సంఖ్యాకాండము 31:35 ముప్పది రెండువేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,

సంఖ్యాకాండము 31:36 అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పది యారువేలు.

సంఖ్యాకాండము 31:37 వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.

సంఖ్యాకాండము 31:38 ఆ గాడిదలు ముప్పదివేల ఐదువందలు,

సంఖ్యాకాండము 31:39 వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.

సంఖ్యాకాండము 31:40 మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.

సంఖ్యాకాండము 31:41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను.

సంఖ్యాకాండము 31:42 సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను.

సంఖ్యాకాండము 31:43 మూడులక్షల ముప్పది యేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును

సంఖ్యాకాండము 31:44 ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

సంఖ్యాకాండము 31:45 పదునారువేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే

సంఖ్యాకాండము 31:46 ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

సంఖ్యాకాండము 31:47 ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను.

1సమూయేలు 30:20 మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.

1దినవృత్తాంతములు 5:21 గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.