Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 16 వచనము 6

1రాజులు 15:22 అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటిచేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.

యెహోషువ 18:24 వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.

యెహోషువ 18:25 గిబియోను రామా బెయేరోతు మిస్పే

యెహోషువ 18:26 కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా

2దినవృత్తాంతములు 21:17 వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.

1దినవృత్తాంతములు 6:60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

యెషయా 10:29 వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అనుచున్నారు సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.

జెకర్యా 14:10 యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొనవరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపుతట్టున నున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును,

యెహోషువ 15:38 దిలాను మిస్పే యొక్తయేలు

యెహోషువ 18:26 కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా

1సమూయేలు 7:6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

1సమూయేలు 7:16 ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

1సమూయేలు 10:17 తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను

2దినవృత్తాంతములు 11:5 రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.

నెహెమ్యా 3:7 వారిని ఆనుకొని గిబియోనీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి.