Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 17 వచనము 19

2దినవృత్తాంతములు 17:2 అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటియందును సైన్యములను ఉంచి, యూదా దేశమందును తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను.

2దినవృత్తాంతములు 17:12 యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.

2దినవృత్తాంతములు 11:12 మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.

2దినవృత్తాంతములు 11:23 అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించినవారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆ యా ప్రదేశములలోని ఆ యా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.

2దినవృత్తాంతములు 11:11 దుర్గములను బలపరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.

2దినవృత్తాంతములు 33:14 ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.