Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 18 వచనము 27

సంఖ్యాకాండము 16:29 మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.

ఆమోసు 9:10 ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు.

అపోస్తలులకార్యములు 13:10 అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?

అపోస్తలులకార్యములు 13:11 ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.

మత్తయి 13:9 చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

మత్తయి 15:10 జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;

మార్కు 7:14 అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి మీరందరు నా మాట విని గ్రహించుడి.

లూకా 20:45 ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు

లూకా 20:46 సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు.

1రాజులు 22:28 అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించుడని చెప్పెను రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.

2దినవృత్తాంతములు 18:34 ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను.