Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 22 వచనము 5

కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక

మీకా 6:16 ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతిపుట్టించు జనులుగాను పట్టణనివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.

2రాజులు 8:28 అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.

2రాజులు 8:29 రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగిరాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

2రాజులు 9:13 అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతనిక్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజైయున్నాడని చాటించిరి.

2దినవృత్తాంతములు 18:3 ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి నీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడ యుధ్దమునకు వచ్చెదమని చెప్పెను.

2దినవృత్తాంతములు 18:31 కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతనియొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.

2దినవృత్తాంతములు 19:2 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.

1రాజులు 22:3 ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించి రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి

దానియేలు 5:22 బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి యంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.

1రాజులు 12:14 నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

2రాజులు 8:26 అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె.

2దినవృత్తాంతములు 10:14 వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.