Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 25 వచనము 1

2రాజులు 14:1 ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.

2రాజులు 14:2 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.

2రాజులు 14:3 ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.

1దినవృత్తాంతములు 3:12 యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు

2దినవృత్తాంతములు 24:27 అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడియున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.