Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 31 వచనము 17

సంఖ్యాకాండము 3:15 లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 3:20 మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

సంఖ్యాకాండము 4:38 గెర్షోనీయులలో వారివారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని

సంఖ్యాకాండము 4:42 మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

సంఖ్యాకాండము 4:46 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ

సంఖ్యాకాండము 17:2 నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారియొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కఱ్ఱగా, అనగా వారి ప్రధానులందరియొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కఱ్ఱలను తీసికొని యెవరి కఱ్ఱమీద వారిపేరు వ్రాయుము.

సంఖ్యాకాండము 17:3 లేవి కఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను.

ఎజ్రా 2:59 మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.

సంఖ్యాకాండము 4:3 ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 8:24 ఇరువదియైదేండ్లు మొదలుకొని పై ప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పనిచేయుటకు రావలెను.

1దినవృత్తాంతములు 23:24 వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

1దినవృత్తాంతములు 23:27 దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారు ఎంచబడిరి.

2దినవృత్తాంతములు 31:2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.

1దినవృత్తాంతములు 24:20 శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

1దినవృత్తాంతములు 24:21 రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,

1దినవృత్తాంతములు 24:22 ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,

1దినవృత్తాంతములు 24:23 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,

1దినవృత్తాంతములు 24:24 ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,

1దినవృత్తాంతములు 24:25 ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,

1దినవృత్తాంతములు 24:26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.

1దినవృత్తాంతములు 24:27 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.

1దినవృత్తాంతములు 24:28 మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.

1దినవృత్తాంతములు 24:29 కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.

1దినవృత్తాంతములు 24:30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీయులు.

1దినవృత్తాంతములు 24:31 వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.

1దినవృత్తాంతములు 25:1 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

1దినవృత్తాంతములు 26:32 పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటిపెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.