Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 36 వచనము 9

2రాజులు 24:8 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.

2రాజులు 24:14 అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొనిపోయెను.

1దినవృత్తాంతములు 3:16 యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.

1దినవృత్తాంతములు 9:1 ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడిన మీదట వారి పేళ్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొనిపోబడిరి.

ఎస్తేరు 2:6 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకోన్యాతో కూడ యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు.

ప్రసంగి 10:16 దేశమా, దాసుడు నీకు రాజై యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.

యెషయా 3:4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.

యిర్మియా 22:26 నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.

యిర్మియా 29:2 యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచివెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,

యిర్మియా 37:1 బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను.

యెహెజ్కేలు 17:3 నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను.

యెహెజ్కేలు 17:12 తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.