Logo

1దెస్సలోనీకయులకు అధ్యాయము 3 వచనము 2

1దెస్సలోనీకయులకు 3:5 ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.

1దెస్సలోనీకయులకు 2:17 సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుబట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.

యిర్మియా 20:9 ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు.

యిర్మియా 44:22 యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.

2కొరిందీయులకు 2:13 నా మనస్సులో నెమ్మదిలేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.

2కొరిందీయులకు 11:29 ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?

2కొరిందీయులకు 11:30 అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులనుగూర్చియే అతిశయపడుదును.

అపోస్తలులకార్యములు 17:15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొనివచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరిపోయిరి.

2తిమోతి 1:4 నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను.