Logo

ఎజ్రా అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా

02 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.

03 అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

04 ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితివిు.

05 యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టి యుంచినందున ఆ సంతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.

06 నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు

07 రాజైన దర్యావేషునకు సకల క్షేమప్రాప్తి యగునుగాక.

08 రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

09 ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు.

10 వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా

11 వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.

12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

13 అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

14 మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి

15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

16 కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

17 కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతినిగూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము.