Logo

కీర్తనలు అధ్యాయము 46

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

02 కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను

03 వాటి జలములు ఘోషించుచు నురుగుకట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)

04 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి.

05 దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.

06 జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగిపోవుచున్నది.

07 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు.

08 యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.

09 ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.

10 ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును

11 సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు.