Logo

కీర్తనలు అధ్యాయము 61

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

02 నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.

03 నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

04 యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కలచాటున దాగుకొందును (సెలా.)

05 దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించియున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించియున్నావు.

06 రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.

07 దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.

08 దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.