Logo

కీర్తనలు అధ్యాయము 62

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త

02 ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఎన్నాళ్లు మీరు ఒకని పైబడుదురు?

03 ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరు ఎన్నాళ్లు ఒకని పడద్రోయ చూచుదురు?

04 అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)

05 నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయనవలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.

06 ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.

07 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందేయున్నది.

08 జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)

09 అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

10 బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.

11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.

12 ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియలచొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.