Logo

కీర్తనలు అధ్యాయము 123

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను.

02 దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి.

03 యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతివిు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి.

04 మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము.