Logo

కీర్తనలు అధ్యాయము 124

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

02 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

03 యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

04 జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును

05 ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

06 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.

07 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొనియున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొనియున్నాము.

08 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది.