Logo

కీర్తనలు అధ్యాయము 125

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.

02 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.

03 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యముమీద నుండదు.

04 యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలుచేయుము.

05 తమ వంకర త్రోవలకు తొలగిపోవువారిని పాపము చేయువారితో కూడ యెహోవా కొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.