Logo

కీర్తనలు అధ్యాయము 126

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సీయోనుకు తిరిగివచ్చినవారిని యెహోవా చెరలోనుండి రప్పించినప్పుడు

02 మనము కలకనినవారివలె నుంటిమి మన నోటినిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.

03 యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతివిు.

04 దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.

05 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

06 పడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.