Logo

కీర్తనలు అధ్యాయము 146

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము

02 నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

03 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి

04 వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.

05 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు

06 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

07 బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

08 యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

09 యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

10 యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును