Logo

యెహెజ్కేలు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కిన చెట్ల కఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా?

03 యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యే యొక ఉపకరణము తగిలించుటకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా?

04 అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా?

05 కాలకముందు అది యే పనికిని తగకపోయెనే; అగ్ని దానియందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికివచ్చునా?

06 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను అగ్నికప్పగించిన ద్రాక్షచెట్టు అడవిచెట్లలో ఏలాటిదో యెరూషలేము కాపురస్థులును ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను.

07 నేను వారిమీద కఠినదృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారియెడల నేను కఠినదృష్టి గలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

08 వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.