Logo

లేవీయకాండము అధ్యాయము 21

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.

02 యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,

03 తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును.

04 అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు.

05 వారు తమ తలలు బోడి చేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొనరాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.

06 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావున వారు పరిశుద్ధులై యుండవలెను.

07 వారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లి చేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.

08 అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను.

09 మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచుకొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.

10 ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;

11 అతడు శవము దగ్గరకు పోరాదు; తన తండ్రి శవము వలననేగాని తన తల్లి శవము వలననేగాని తన్ను అపవిత్రపరచుకొనరాదు.

12 దేవుని అభిషేకతైలము అనెడు కిరీటముగా అతనిమీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచరాదు; నేను యెహోవాను

13 అతడు కన్యకను పెండ్లి చేసికొనవలెను.

14 విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.

15 యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

17 నీవు అహరోనుతో ఇట్లనుము నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.

18 ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవయవము గలవాడే గాని

19 కాలైనను చేయినైనను విరిగినవాడే గాని

20 గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.

21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.

22 అతిపరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.

23 మెట్టుకు అతడు కళంకము గలవాడుగనుక అడ్డతెర యెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

24 నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.