లేఖనాలను అన్వేషించండి

ఎస్తేరు 4: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎస్తేరు 1:12

రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.

1సమూయేలు 8:15

మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును.

2రాజులు 9:32

అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి నా పక్షమందున్నవారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

యెషయా 56:3

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

అపోస్తలులకార్యములు 8:27

అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటిమీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.

ఆదికాండము 37:35

అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారునియొద్దకు వెళ్లేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను

కీర్తనలు 77:2

నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది.

యిర్మియా 31:15

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారినిగూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

2రాజులు 25:29

కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్ర ములను ధరించుకొని తాను బ్రదికిన దినములన్నియు రాజు సన్నిధిని భోజనముచేయుచు వచ్చెను.

సామెతలు 31:26

జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.