Logo

2సమూయేలు అధ్యాయము 3 వచనము 16

సామెతలు 9:17 అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.

సామెతలు 9:18 అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.

2సమూయేలు 16:5 రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు

2సమూయేలు 17:18 తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని యిల్లు చేరి అతని యింటి ముంగిట ఒక బావి యుండగా దానిలో దిగి దాగియుండిరి.

2సమూయేలు 19:16 అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడ వచ్చెను.

1రాజులు 2:8 మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగా యెహోవాతోడు కత్తిచేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.

యిర్మియా 41:6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలువెళ్లి వారిని కలిసికొని వారితో-- అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు రండనెను.