Logo

2సమూయేలు అధ్యాయము 6 వచనము 15

కీర్తనలు 132:18 అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

1దినవృత్తాంతములు 15:16 అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

1దినవృత్తాంతములు 15:25 దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.

1దినవృత్తాంతములు 15:28 ఇశ్రాయేలీయులందరును ఆర్బాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.

ఎజ్రా 3:10 శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

ఎజ్రా 3:11 వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.

కీర్తనలు 47:1 సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.

కీర్తనలు 47:5 దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.

కీర్తనలు 47:6 దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.

కీర్తనలు 68:24 దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా

కీర్తనలు 68:25 కీర్తనలు పాడువారు ముందరనడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.

కీర్తనలు 68:26 సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభువును స్తుతించుడి.

కీర్తనలు 68:27 కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.

సంఖ్యాకాండము 10:1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము;

సంఖ్యాకాండము 10:2 నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.

సంఖ్యాకాండము 10:3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీయొద్దకు కూడిరావలెను.

సంఖ్యాకాండము 10:4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడిరావలెను.

సంఖ్యాకాండము 10:5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను.

సంఖ్యాకాండము 10:6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.

సంఖ్యాకాండము 10:7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.

సంఖ్యాకాండము 10:8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.

సంఖ్యాకాండము 10:9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.

సంఖ్యాకాండము 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

యెహోషువ 6:4 ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.

యెహోషువ 6:5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.

కీర్తనలు 150:3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

2దినవృత్తాంతములు 20:27 ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి;