Logo

2సమూయేలు అధ్యాయము 10 వచనము 14

2సమూయేలు 8:12 వాటిని అతడు సిరియనుల యొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబా రాజునొద్దనుండియు పట్టుకొనియుండెను.

2సమూయేలు 20:6 దావీదు అబీషైని పిలువనంపి బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడు చేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.

2సమూయేలు 22:38 నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

2సమూయేలు 23:18 సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు.

1దినవృత్తాంతములు 18:12 మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.

కీర్తనలు 48:4 రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి.