Logo

2సమూయేలు అధ్యాయము 17 వచనము 9

న్యాయాధిపతులు 20:33 ఇశ్రాయేలీయులందరు తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి.

1సమూయేలు 22:1 దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.

1సమూయేలు 24:3 మార్గముననున్న గొఱ్ఱదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

యెహోషువ 7:5 అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.

యెహోషువ 8:6 మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలు దేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని

న్యాయాధిపతులు 20:32 బెన్యామీనీయులు మునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరి గాని ఇశ్రాయేలీయులుమనము పారిపోయి వారిని పట్ట ణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.

1సమూయేలు 14:14 యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.

1సమూయేలు 14:15 దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.

యిర్మియా 41:9 ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.