Logo

2సమూయేలు అధ్యాయము 18 వచనము 17

యెహోషువ 7:26 వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.

యెహోషువ 8:29 యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.

యెహోషువ 10:27 ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.

సామెతలు 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

యిర్మియా 22:18 కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదా రాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతనిగూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.

యిర్మియా 22:19 అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును.

ఆదికాండము 31:46 మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనము చేసిరి.

ఆదికాండము 35:20 యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.

2రాజులు 14:12 యూదావారు ఇశ్రాయేలువారి యెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.

కీర్తనలు 119:96 సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది.

ప్రసంగి 3:5 రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

అపోస్తలులకార్యములు 5:6 అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.