Logo

2సమూయేలు అధ్యాయము 18 వచనము 27

2రాజులు 9:20 అప్పుడు కావలి వాడు వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడమువలెనే యున్నదనెను.

1రాజులు 1:42 యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా

సామెతలు 25:13 నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచుచల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును.

సామెతలు 25:25 దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.

యెషయా 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.

రోమీయులకు 10:15 ప్రకటించువారు పంపబడనియెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందువిషయమై ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది

ఆదికాండము 24:54 అతడును అతనితోకూడ నున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానునియొద్దకు నన్ను పంపించుడని చెప్పగా

2సమూయేలు 18:19 సాదోకు కుమారుడైన అహిమయస్సునేను పరుగెత్తికొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా

2సమూయేలు 18:20 యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.

1దినవృత్తాంతములు 6:8 అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

అపోస్తలులకార్యములు 11:24 అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.

రోమీయులకు 5:7 నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.