Logo

2సమూయేలు అధ్యాయము 19 వచనము 41

న్యాయాధిపతులు 8:1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతోనీవు మాయెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.

న్యాయాధిపతులు 12:1 ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా

యోహాను 7:5 ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

యోహాను 7:6 యేసు నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.

2సమూయేలు 19:3 నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.

ఆదికాండము 31:26 అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారినివలె నా కుమార్తెలను కొనిపోవనేల?

ఆదికాండము 31:27 నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.

2సమూయేలు 3:12 అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.

2సమూయేలు 18:7 ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేలమంది అక్కడ హతులైరి.

2సమూయేలు 20:1 బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలు వారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా

2సమూయేలు 20:2 ఇశ్రాయేలు వారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.

సామెతలు 17:14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 26:4 వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

ప్రసంగి 10:13 వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెఱ్ఱితనము.