Logo

2సమూయేలు అధ్యాయము 20 వచనము 16

2సమూయేలు 14:2 తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

1సమూయేలు 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియై యుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు.

1సమూయేలు 25:32 అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

1సమూయేలు 25:33 నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.

ప్రసంగి 9:14 ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్దిమంది కాపురముండిరి; దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను;

ప్రసంగి 9:15 అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.

ప్రసంగి 9:16 కాగా నేనిట్లనుకొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.

ప్రసంగి 9:17 బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు.

ప్రసంగి 9:18 యుద్ధాయుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.

సామెతలు 11:16 నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.

సామెతలు 21:22 జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.

సామెతలు 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

ప్రసంగి 7:19 పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.

దానియేలు 2:14 అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవి చేసెను