Logo

2సమూయేలు అధ్యాయము 22 వచనము 6

యోబు 36:8 వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధా పాశములచేత పట్టబడినయెడలను

కీర్తనలు 18:5 పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

కీర్తనలు 116:3 మరణబంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

కీర్తనలు 140:5 గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

సామెతలు 5:22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

యోనా 2:2 నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.

అపోస్తలులకార్యములు 2:24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.

సామెతలు 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.

సామెతలు 14:27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును

కీర్తనలు 18:4 మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను