Logo

నెహెమ్యా అధ్యాయము 11 వచనము 23

1దినవృత్తాంతములు 9:33 లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.

ఎజ్రా 6:8 మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.

ఎజ్రా 6:9 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలే గాని గొఱ్ఱపొట్టేళ్లే గాని గొఱ్ఱ పిల్లలేగాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్షారసమే గాని నూనెయే గాని, యెరూషలేములో నున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

ఎజ్రా 7:20 నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును.

ఎజ్రా 7:21 మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యము కాకుండ మీరు దాని చేయవలెను.

ఎజ్రా 7:22 వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.

ఎజ్రా 7:23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను?

ఎజ్రా 7:24 మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరినిగూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.

నిర్గమకాండము 16:4 యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశమునుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.

2రాజులు 25:30 మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లు ఆ చొప్పున అతని కియ్యబడుచుండెను.