Logo

నెహెమ్యా అధ్యాయము 12 వచనము 35

సంఖ్యాకాండము 10:2 నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.

సంఖ్యాకాండము 10:3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీయొద్దకు కూడిరావలెను.

సంఖ్యాకాండము 10:4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడిరావలెను.

సంఖ్యాకాండము 10:5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను.

సంఖ్యాకాండము 10:6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.

సంఖ్యాకాండము 10:7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.

సంఖ్యాకాండము 10:8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.

సంఖ్యాకాండము 10:9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.

సంఖ్యాకాండము 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

యెహోషువ 6:4 ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.

2దినవృత్తాంతములు 5:12 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలనుచేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,

2దినవృత్తాంతములు 13:12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు.

నెహెమ్యా 11:17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతనిచేతిక్రిందివారు

1దినవృత్తాంతములు 6:39 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,

1దినవృత్తాంతములు 6:40 షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు,

1దినవృత్తాంతములు 6:41 మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,

1దినవృత్తాంతములు 6:42 అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమీ కుమారుడు,

1దినవృత్తాంతములు 6:43 షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.

1దినవృత్తాంతములు 25:2 ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.

1దినవృత్తాంతములు 26:10 మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠభాగస్థునిగా చేసెను,

1దినవృత్తాంతములు 26:11 రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.

సంఖ్యాకాండము 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

నెహెమ్యా 11:22 యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు

నెహెమ్యా 12:41 యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.

నెహెమ్యా 13:13 నమ్మకముగల మనుష్యులని పేరుపొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారిచేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను.