Logo

నిర్గమకాండము అధ్యాయము 27 వచనము 20

నిర్గమకాండము 39:37 పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును

లేవీయకాండము 24:2 దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముకొరకు దంచితీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

లేవీయకాండము 24:3 ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తర తరములకు నిత్యమైన కట్టడ.

లేవీయకాండము 24:4 అతడు నిర్మలమైన దీపవృక్షముమీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

న్యాయాధిపతులు 9:9 మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

కీర్తనలు 23:5 నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

జెకర్యా 4:11 దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,

జెకర్యా 4:12 రెండు బంగారపు కొమ్ములలోనుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా

జెకర్యా 4:13 అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా

జెకర్యా 4:14 అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను.

ప్రకటన 11:4 వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.

నిర్గమకాండము 25:31 మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషిపనిగా చేయవలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై యుండవలెను.

నిర్గమకాండము 25:32 దీపవృక్షము యొక్క ఒక ప్రక్కనుండి మూడు కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు నిగుడవలెను.

నిర్గమకాండము 25:33 ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.

నిర్గమకాండము 25:34 మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,

నిర్గమకాండము 25:35 దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మలక్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.

నిర్గమకాండము 25:36 వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషిపనిగా ఉండవలెను.

నిర్గమకాండము 25:37 నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.

నిర్గమకాండము 30:8 మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.

1సమూయేలు 3:3 దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను

నిర్గమకాండము 25:6 ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,

నిర్గమకాండము 30:7 అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.

నిర్గమకాండము 35:8 అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్యధూపమునకును సుగంధ సంభారములు,

సంఖ్యాకాండము 4:16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము.

1దినవృత్తాంతములు 9:29 మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరిశుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను.

2దినవృత్తాంతములు 4:20 వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,

2దినవృత్తాంతములు 13:11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.