Logo

మత్తయి అధ్యాయము 6 వచనము 28

మత్తయి 5:36 నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.

కీర్తనలు 39:6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

ప్రసంగి 3:14 దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు.

లూకా 12:25 మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొనగలడు?

లూకా 12:26 కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కినవాటినిగూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి.

1కొరిందీయులకు 12:18 అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.

ప్రసంగి 1:15 వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపము గలది లెక్కకు రాదు.

1తిమోతి 1:19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయిన వారివలె చెడియున్నారు.