Logo

మత్తయి అధ్యాయము 13 వచనము 14

మత్తయి 13:16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.

ద్వితియోపదేశాకాండము 29:3 ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులార చూచితిరి.

ద్వితియోపదేశాకాండము 29:4 అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చియుండలేదు.

యెషయా 42:18 చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలోచించుడి.

యెషయా 42:19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

యెషయా 42:20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

యెషయా 44:18 వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను.

యిర్మియా 5:21 కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.

యెహెజ్కేలు 12:2 నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడకయున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.

మార్కు 8:17 యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా?

మార్కు 8:18 మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?

యోహాను 3:19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

యోహాను 3:20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.

యోహాను 9:39 అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.

యోహాను 9:40 ఆయనయొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.

యోహాను 9:41 అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

2కొరిందీయులకు 4:3 మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది.

2కొరిందీయులకు 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

న్యాయాధిపతులు 14:12 అప్పుడు సమ్సోనుమీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.

1రాజులు 22:23 యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

కీర్తనలు 78:2 నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.

కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.

సామెతలు 20:12 వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

యెషయా 1:3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

యెషయా 48:8 అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వమునుండి నీ చెవి తెరువబడనేలేదు నీవు అపనమ్మకస్థుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియును.

యెహెజ్కేలు 17:2 నరపుత్రుడా, నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ యొకటి ఇశ్రాయేలీయులకు వేయుము. ఎట్లనగా ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

యెహెజ్కేలు 20:49 అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్నుగూర్చి చెప్పుదురని నేనంటిని.

దానియేలు 2:22 ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగు యొక్క నివాసస్థలము ఆయనయొద్ద నున్నది.

మత్తయి 13:34 నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను

మత్తయి 24:39 జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగకపోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.

మార్కు 4:11 అందుకాయన దేవుని రాజ్యమర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని

యోహాను 10:6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

యోహాను 12:40 వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.

రోమీయులకు 3:11 గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు

2కొరిందీయులకు 3:14 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.