Logo

హెబ్రీయులకు అధ్యాయము 10 వచనము 21

యోహాను 10:7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను

యోహాను 10:9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

యోహాను 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.

హెబ్రీయులకు 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.

హెబ్రీయులకు 9:3 రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.

నిర్గమకాండము 26:31 మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.

నిర్గమకాండము 26:32 తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.

నిర్గమకాండము 26:33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

నిర్గమకాండము 26:34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.

నిర్గమకాండము 26:35 అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.

నిర్గమకాండము 26:36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.

నిర్గమకాండము 26:37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను.

నిర్గమకాండము 36:35 మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులు గలదానిగా దాని చేసెను.

నిర్గమకాండము 36:36 దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.

నిర్గమకాండము 36:37 మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డతెరను చేసెను.

నిర్గమకాండము 36:38 దాని అయిదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించెను; వాటి అయిదు దిమ్మలు ఇత్తడివి.

లేవీయకాండము 16:2 నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసముమీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.

లేవీయకాండము 16:15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.

లేవీయకాండము 21:23 మెట్టుకు అతడు కళంకము గలవాడుగనుక అడ్డతెర యెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

మత్తయి 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;

మార్కు 15:38 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.

లూకా 23:45 సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను.

యోహాను 6:51 పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యోహాను 6:52 యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

యోహాను 6:53 కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.

యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.

యోహాను 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

ఎఫెసీయులకు 2:15 ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,

1తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తినిగూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

1పేతురు 3:18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు,

1యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;

2యోహాను 1:7 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరియున్నారు.

ఆదికాండము 18:31 అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా

నిర్గమకాండము 40:21 మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

నిర్గమకాండము 40:28 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి

సంఖ్యాకాండము 4:5 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

సంఖ్యాకాండము 4:20 వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

1రాజులు 6:31 గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.

2దినవృత్తాంతములు 3:14 అతడు నీలి నూలుతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను సన్నపు నారనూలుతోను ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను కుట్టించెను.

కీర్తనలు 25:9 న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.

పరమగీతము 2:9 నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు లేడిపిల్లవలె నున్నాడు అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు కిటికీగుండ చూచుచున్నాడు కిటికీ కంతగుండ తొంగి చూచుచున్నాడు

యెషయా 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు

యిర్మియా 32:39 మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.

రోమీయులకు 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

రోమీయులకు 5:2 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

రోమీయులకు 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.

ఎఫెసీయులకు 2:18 ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి యున్నాము.

కొలొస్సయులకు 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.

హెబ్రీయులకు 9:7 సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తముచేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

హెబ్రీయులకు 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము.