Logo

హెబ్రీయులకు అధ్యాయము 13 వచనము 5

ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.

ఆదికాండము 2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను.

ఆదికాండము 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

లేవీయకాండము 21:13 అతడు కన్యకను పెండ్లి చేసికొనవలెను.

లేవీయకాండము 21:14 విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.

లేవీయకాండము 21:15 యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

2రాజులు 22:14 కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయాయును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా

సామెతలు 5:15 నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

సామెతలు 5:16 నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

సామెతలు 5:17 అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.

సామెతలు 5:18 నీ ఊట దీవెన నొందును. నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.

సామెతలు 5:19 ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

సామెతలు 5:20 నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పర స్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

సామెతలు 5:21 నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

సామెతలు 5:22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

సామెతలు 5:23 శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును.

యెషయా 8:3 నేను ప్రవక్త్రియొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌2 అను పేరు పెట్టుము.

1కొరిందీయులకు 7:2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను.

1కొరిందీయులకు 7:3 భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.

1కొరిందీయులకు 7:4 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

1కొరిందీయులకు 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

1కొరిందీయులకు 7:6 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండగోరుచున్నాను.

1కొరిందీయులకు 7:7 అయినను ఒకడొక విధమునను మరియొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

1కొరిందీయులకు 7:8 నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 7:9 అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లి చేసికొనుట మేలు.

1కొరిందీయులకు 7:10 మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

1కొరిందీయులకు 7:11 ఎడబాసినయెడల పెండ్లి చేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు.

1కొరిందీయులకు 7:12 ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురముచేయ నిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

1కొరిందీయులకు 7:13 మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు.

1కొరిందీయులకు 7:14 అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధపరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు

1కొరిందీయులకు 7:15 అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను (అనేక ప్రాచీన ప్రతులలో - మిమ్మును అని పాటాంతరము) పిలిచియున్నాడు

1కొరిందీయులకు 7:16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?

1కొరిందీయులకు 9:5 తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?

1తిమోతి 3:2 అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,

1తిమోతి 3:4 సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను.

1తిమోతి 3:12 పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను.

1తిమోతి 5:14 కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.

తీతుకు 1:6 ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.

హెబ్రీయులకు 12:16 ఒకపూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

1కొరిందీయులకు 6:9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను

గలతీయులకు 5:19 శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

గలతీయులకు 5:21 భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

ఎఫెసీయులకు 5:5 వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

కొలొస్సయులకు 3:5 కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను6 చంపివేయుడి.

కొలొస్సయులకు 3:6 వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.

ప్రకటన 22:15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

కీర్తనలు 50:16 భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?

కీర్తనలు 50:17 దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.

కీర్తనలు 50:18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

కీర్తనలు 50:19 కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

కీర్తనలు 50:20 నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.

కీర్తనలు 50:21 ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

కీర్తనలు 50:22 దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును

మలాకీ 3:5 తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

1కొరిందీయులకు 5:13 మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి.

2కొరిందీయులకు 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

ఆదికాండము 2:22 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.

ఆదికాండము 12:15 ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

ఆదికాండము 12:17 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.

ఆదికాండము 20:7 కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించనియెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

ఆదికాండము 20:9 అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను

ఆదికాండము 34:7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.

ఆదికాండము 39:9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను.

నిర్గమకాండము 20:14 వ్యభిచరింపకూడదు.

లేవీయకాండము 15:18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.

లేవీయకాండము 15:24 ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.

లేవీయకాండము 18:20 నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.

సంఖ్యాకాండము 5:16 అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.

సంఖ్యాకాండము 5:18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తలముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 22:22 ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.

రూతు 4:10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలము యొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.

2సమూయేలు 11:27 అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

యోబు 31:2 ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

యోబు 31:12 అది నాశనకూపము వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.

కీర్తనలు 50:18 నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

సామెతలు 5:11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

సామెతలు 5:22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

సామెతలు 6:32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే

యిర్మియా 5:7 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?

యిర్మియా 23:10 దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.

యెహెజ్కేలు 18:6 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,

యెహెజ్కేలు 22:11 ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.

మత్తయి 8:14 తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి

మత్తయి 19:6 కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను.

మార్కు 10:11 అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును.

లూకా 20:34 అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు, పెండ్లికియ్యబడుదురు గాని

యోహాను 2:1 మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.

యోహాను 2:2 యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి.

యోహాను 4:18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను.

అపోస్తలులకార్యములు 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

1కొరిందీయులకు 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.

1కొరిందీయులకు 7:28 అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను

1కొరిందీయులకు 7:38 కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు.

1కొరిందీయులకు 16:14 మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.

2కొరిందీయులకు 12:21 నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.

ఎఫెసీయులకు 5:3 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

1దెస్సలోనీకయులకు 4:3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.

1దెస్సలోనీకయులకు 4:4 మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక,

1తిమోతి 1:10 హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండినయెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,

1తిమోతి 4:3 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.

2పేతురు 2:10 శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.

ప్రకటన 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు

ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.