Logo

ఎస్తేరు అధ్యాయము 3 వచనము 3

ఎస్తేరు 3:2 కాబట్టి రాజు గుమ్మమున నున్న రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా

నిర్గమకాండము 1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తు రాజు తమకాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా

మత్తయి 15:2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందునిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

మత్తయి 15:3 అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?

ఎస్తేరు 2:19 రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.

ఎస్తేరు 6:6 రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను