Logo

ఎస్తేరు అధ్యాయము 8 వచనము 1

యోబు 27:16 ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను

యోబు 27:17 వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.

కీర్తనలు 39:6 మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.

కీర్తనలు 49:6 తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనవిస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?

కీర్తనలు 49:7 ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు

కీర్తనలు 49:8 వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు

కీర్తనలు 49:9 వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.

కీర్తనలు 49:10 జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.

కీర్తనలు 49:11 వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.

కీర్తనలు 49:12 ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు.

కీర్తనలు 49:13 స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.

సామెతలు 13:22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

సామెతలు 28:8 వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.

ప్రసంగి 2:18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని.

ప్రసంగి 2:19 వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.

లూకా 12:20 అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.

ఎస్తేరు 1:14 అతడు కాలజ్ఞానులను చూచి రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.

ఎస్తేరు 2:7 తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.

ఎస్తేరు 2:15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.

ఆదికాండము 31:9 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.

ఎస్తేరు 8:7 రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.

ఎస్తేరు 9:25 ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.

కీర్తనలు 37:10 ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

యెషయా 49:23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.