Logo

పరమగీతము అధ్యాయము 7 వచనము 4

పరమగీతము 4:5 నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో మేయు కవలను పోలియున్నవి.

పరమగీతము 6:6 నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నవి.

సామెతలు 5:19 ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

పరమగీతము 7:7 నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ కుచములు గెలలవలె నున్నవి.

పరమగీతము 8:8 మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము?

పరమగీతము 8:10 నేను ప్రాకారమువంటి దాననైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని.