Logo

పరమగీతము అధ్యాయము 8 వచనము 6

పరమగీతము 3:6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?

పరమగీతము 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

పరమగీతము 4:8 ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము లెబానోను విడిచి నాతోకూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి శెనీరు హెర్మోనుల శిఖరమునుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల కొండలపైనుండి నీవు క్రిందికి చూచెదవు.

కీర్తనలు 45:10 కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

కీర్తనలు 45:11 ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.

కీర్తనలు 107:2 యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును

కీర్తనలు 107:3 తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణమునుండియు నానా దేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.

కీర్తనలు 107:4 వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరుకకపోయెను.

కీర్తనలు 107:5 ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.

కీర్తనలు 107:6 వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

కీర్తనలు 107:7 వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను.

కీర్తనలు 107:8 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక

యెషయా 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.

యెషయా 43:19 ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.

యిర్మియా 2:2 నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగని దేశములోను, నన్ను వెంబడించుచు నీ యౌవనకాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

ప్రకటన 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

2దినవృత్తాంతములు 32:8 మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

కీర్తనలు 63:8 నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.

యెషయా 26:3 ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.

యెషయా 26:4 యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

యెషయా 36:6 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.

మీకా 3:11 జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.

యోహాను 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

అపోస్తలులకార్యములు 27:23 నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;

అపోస్తలులకార్యములు 27:24 నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమైపోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.

అపోస్తలులకార్యములు 27:25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.

2కొరిందీయులకు 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

2కొరిందీయులకు 12:10 నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.

ఎఫెసీయులకు 1:12 దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.

ఎఫెసీయులకు 1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

1పేతురు 1:21 మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,

పరమగీతము 2:3 అడవివృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.

హోషేయ 12:4 అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;

యోహాను 1:48 నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టుక్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.

యోహాను 1:49 నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.

యోహాను 1:50 అందుకు యేసు ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.

యోహాను 1:51 మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

పరమగీతము 8:1 నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరునివలె నీవు నాయెడల నుండిన నెంత మేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.

పరమగీతము 3:4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

పరమగీతము 3:11 సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.

యెషయా 49:20 నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

యెషయా 49:21 అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.

యెషయా 49:22 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయి యెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు

యెషయా 49:23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు.

రోమీయులకు 7:4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.

గలతీయులకు 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

ద్వితియోపదేశాకాండము 32:10 అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను.

యెషయా 40:31 యెహోవాకొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

యెషయా 63:1 రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చుచున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యితడెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.

యిర్మియా 31:32 అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

యిర్మియా 46:7 నైలునదీ ప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

యోహాను 15:4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.

హెబ్రీయులకు 8:9 అది నేను ఐగుప్తు దేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు

ప్రకటన 17:3 అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని