Logo

విలాపవాక్యములు అధ్యాయము 3 వచనము 21

యోబు 21:6 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

కీర్తనలు 42:5 నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.

కీర్తనలు 42:6 నా దేవా, నా ప్రాణము నాలో క్రుంగియున్నది కావున యొర్దాను ప్రదేశమునుండియు హెర్మోను పర్వతమునుండియు మిసారు కొండనుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

కీర్తనలు 42:11 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

కీర్తనలు 43:5 నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

కీర్తనలు 146:8 యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు

ద్వితియోపదేశాకాండము 16:12 నీవు ఐగుప్తులో దాసుడవైయుండిన సంగతిని జ్ఞాపకము చేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

యోబు 23:2 నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది

కీర్తనలు 102:4 ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయియున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను.

మత్తయి 5:23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల