Logo

2కొరిందీయులకు అధ్యాయము 1 వచనము 3

రోమీయులకు 1:7 మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు.

2సమూయేలు 15:20 నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగులాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొనిపొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా

1దినవృత్తాంతములు 12:18 అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

దానియేలు 4:1 రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక.

1కొరిందీయులకు 1:3 మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.

గలతీయులకు 6:16 ఈ పద్ధతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక.

ఎఫెసీయులకు 6:23 తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

ఫిలిప్పీయులకు 1:2 మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

కొలొస్సయులకు 1:2 దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

1దెస్సలోనీకయులకు 1:1 తండ్రియైన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2దెస్సలోనీకయులకు 1:2 తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

ఫిలేమోనుకు 1:3 మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

లూకా 11:2 అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,

యోహాను 14:18 మిమ్మును అనాథలనుగా విడువను, మీయొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;

గలతీయులకు 1:3 తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

ఎఫెసీయులకు 1:2 మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

1పేతురు 1:17 పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.

ప్రకటన 1:4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,