Logo

2కొరిందీయులకు అధ్యాయము 8 వచనము 15

నిర్గమకాండము 16:18 వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.

లేవీయకాండము 7:10 అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.

సంఖ్యాకాండము 35:8 మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములోనుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యముచొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలెను.

యెహోషువ 19:9 షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.

లూకా 6:38 క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:44 విశ్వసించిన వారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.

2కొరిందీయులకు 9:12 ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.

1యోహాను 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?