Logo

2తిమోతి అధ్యాయము 4 వచనము 21

అపోస్తలులకార్యములు 19:22 అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.

రోమీయులకు 16:23 నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

అపోస్తలులకార్యములు 20:4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.

అపోస్తలులకార్యములు 21:29 ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.

అపోస్తలులకార్యములు 20:15 అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితివిు.

అపోస్తలులకార్యములు 20:17 అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.

ఫిలిప్పీయులకు 2:26 అతడు రోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను.

ఫిలిప్పీయులకు 2:27 నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతని మాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.

యోహాను 11:3 అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

అపోస్తలులకార్యములు 17:15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొనివచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరిపోయిరి.

అపోస్తలులకార్యములు 18:1 అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.