Logo

యెహోషువ అధ్యాయము 8 వచనము 3

మత్తయి 24:39 జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవువరకు ఎరుగకపోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.

మత్తయి 24:50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.

మత్తయి 25:6 అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.

1దెస్సలోనీకయులకు 5:2 రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

2పేతురు 3:10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును

ఆదికాండము 12:8 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్ధన చేసెను

యెహోషువ 8:12 వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.

యెహోషువ 8:17 ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.